Delhi Airport : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్(ATC)లో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. శుక్రవారం ఈ సమస్య కారణంగా ఏకంగా 800 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. వీటిలో దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. గురువారం రాత్రి అటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ (AMSS)లో లోపం ఏర్పడిందని.. అందుకే సమాచార వ్యవస్థ దెబ్బతిన్నదని అధికారులు గుర్తించారు. ఫలితంగానే విమానాల్ని సాంకేతికంగా ట్రాక్ చేయడం సాధ్యం కాలేదని వెల్లడించారు.
‘అటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్లో సాంకేతిక సమస్య కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆటోమేటిక్గా సర్వీసులను ట్రాక్ చేయడం సాధ్యపడలేదు. దాంతో.. ఢిల్లీ ఎయిర్పోర్టులో అన్ని విమాన సర్వీసులపై ప్రభావం పడింది. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రయాణికులు సవరించిన విమాన షెడ్యూల్ వివరాలు, అప్డేట్స్ కోసం ఎయిర్లైన్స్ వెబ్సైట్ చూడాలని కోరుతున్నాం’ అని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. భారీగా విమానాలు నిలిచిపోవడంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) రోజుకు 1,500కి పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డేటాను సపోర్ట్ చేసే ఆటోమేటిక్ స్విచింగ్ (AMSS)లో సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ఆలస్యమవుతున్నాయని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తెలిపింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఏఏఐ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ సేవలను అందిస్తుంది. వీలైనంత త్వరగా వ్యవస్థను పునరుద్ధరించడానికి సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొంది. ఢిల్లీ విమానాశ్రయాన్ని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) నిర్వహిస్తున్నది.
Airports Authority of India tweets, “Update on Technical Fault at IGI Airport, New Delhi. Immediately, the review meeting was conducted by the Secretary, MoCA, with Chairman AAI, Member ANS, and other officials, and necessary directions were given to address the issues. A team of… pic.twitter.com/dx24EoIWdl
— ANI (@ANI) November 7, 2025