Aiden Markram | ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ – 2023 టోర్నీలో సౌతాఫ్రికా బ్యాటర్ అడైన్ మార్క్రమ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో చెలరేగి పోయాడు. కేవలం 49 బంతుల్లో 102 పరుగులు చేశాడు. తద్వారా 2011 వరల్డ్ కప్ టోర్నీలో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ బ్యాటర్ కెవిన్ ఓబ్రెయిన్ 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 54 బంతులు ఆడిన మార్క్రమ్ 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. అంతకుముందు క్వింటన్ డీకాక్, రస్సీ వాన్ డెర్ డసన్ కూడా చెరో శతకం చేసి, శ్రీలంక బౌలర్ల వెన్ను విరిచారు.
పరుగులు — బంతులు — బ్యాట్స్మన్——- మ్యాచ్ ———- —– తేదీ
106 —— 49 ——- అడైన్ మార్క్రమ్ — సౌతాఫ్రికా v శ్రీలంక — 2023, అక్టోబర్ 7
113 ——- 50 ——- కెవిన్ ఓబ్రెయిన్ — ఐర్లాండ్ v ఇంగ్లండ్ — 2011, మార్చి 2
102 —— 51 ——– గ్లెన్ మ్యాక్స్ వెల్ — ఆస్ట్రేలియా v శ్రీలంక — 2015, మార్చి 08
162 —— 52 —— ఏబీ డీ విలియర్స్ — సౌతాఫ్రికా v వెస్టిండీస్ — 27, ఫిబ్రవరి 2015
162 —— 57 —— ఎయిగోన్ మార్గాన్ – ఇంగ్లండ్ v ఆఫ్ఘనిస్తాన్ — 18, జూన్ 2019
101 —— 66 ——- మాథ్యూ హేడేన్ — ఆస్ట్రేలియా v సౌతాఫ్రికా — 24, మార్చి 2007
111 ——- 67 ——- జాన్ డేవిడ్సన్ — కెనడా v వెస్టిండీస్ — 23, ఫిబ్రవరి 2003
117 —— 70 ——- కుమార్ సంగక్కర — శ్రీలంక v ఇంగ్లండ్ — 01, మార్చి 2015
101 —— 70 ——-పాల్ స్టెర్లింగ్ —— ఐర్లాండ్ v నెదర్లాండ్స్ — 18, మార్చి 2011