MS Dhoni | ముంబై: వయసు గురించి ఎవరూ పట్టించుకోరని, క్రికెట్లో మనం ఏ స్థాయిలో పోటీపడుతున్నామనదే ముఖ్యమని భారత దిగ్గజ క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీ పేర్కొన్నాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్న ధోనీపై చెన్నై ఎనలేని నమ్మకం పెట్టుకుంది.
ఓవైపు వయసు పెరుగుతున్నా..తన చేవలో తగ్గలేదని ధోనీ నిరూపిస్తూనే ఉన్నాడు. ఐపీఎల్‌పై ధోనీ స్పందిస్తూ ‘రెండు నెలలు జరిగే ఐపీఎల్ కోసం ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు కష్టపడుతాను. ఏడాదిలో కొన్ని రోజులే క్రికెట్ ఆడుతాను. అందుకోసం కష్టపడటాన్ని ఎంజాయ్ చేస్తాను’ అని అన్నాడు.