హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి అగసర నందిని రజత పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్ రేసును నందిని 13.5769 సెకన్ల టైమింగ్తో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ టోర్నీల్లో మెరిసిన ఈ ఎస్సీ గురుకుల విద్యార్థి 0.0006సెకన్ల తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. నందిని విజయం పట్ల గురుకుల విద్యా సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.