పారిస్: కొద్దిరోజుల క్రితమే ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్‌కే వెనుదిరిగిన స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ మరోసారి నిరాశజనక ప్రదర్శనతో తన ఒలింపిక్ సింగిల్స్ కెరీర్‌ను ఓటమితో ముగించాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో నాదల్.. 1-6, 4-6తో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) చేతిలో ఓడాడు. 41 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో నాగల్ చేసిన పలు తప్పిదాలు అతడి పరాభవానికి దారితీశాయి. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జొకో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు.