IND Vs PAK | గత కొంతకాలంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు మరింత దిగజారిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచులపై కనిపించింది. మ్యాచ్ ఇరుదేశాల ఆటగాళ్లు కరచాలనం చేయని విషయం తెలిసిందే. ఈ అంశంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా భారత్-పాకిస్తాన్ మధ్య సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ హాకీ టోర్నీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకున్నది. మంగళవారం జూనియర్ హాకీ మ్యాచ్‌కు ముందు రెండు దేశాల జాతీయ గీతాలు ఆలపించారు. ఆ తర్వాత ఇరుదేశాల ఆటగాళ్లు హై-ఫైవ్ చేశారు. మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. ఆ తర్వాత, రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేస్తున్నట్లు కనిపించింది.
కొన్ని వారాల కిందట జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో రెండు దేశాల ఆటగాళ్ల మధ్య అలాంటి దృశ్యం కనిపించని విషయం తెలిసిందే. ఆసియా కప్ క్రికెట్లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో భారత జట్టు పాకిస్తాన్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించింది. ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు గౌరవం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఫైనల్లో భారతదేశం పాకిస్తాన్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ఆ సమయంలో పాక్ హోంమంత్రిగా ఉన్న ఏసీసీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ నుంచి సైతం ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది.
ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో మ్యాచులు ఆడకూడదని సైతం డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆసియా కప్ తర్వాత, సూర్యకుమార్ యాదవ్‌ను పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేయకూడదనే విధానం భవిష్యత్తులో కొనసాగుతుందా? అని ప్రశ్నించగా.. బ్యాలెన్స్‌గా సమాధానం ఇచ్చాడు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తనకు తెలియదని.. తాము ఇంటర్నేషనల్ టోర్నీలో మాత్రమే పాక్‌తో ఆడుతామని.. మళ్లీ ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో చూద్దామని.. ప్రస్తుతం ఆ క్షణాలను ఆస్వాదించాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టీం ఇండియా క్రీడా స్ఫూర్తికి, జాతీయ గౌరవానికి మధ్య సమతుల్యతను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ హాకీ టోర్నమెంట్లో భిన్నమైన వాతావరణం ఉంది. మ్యాచ్‌కు ముందు, పాకిస్తాన్ హాకీ సమాఖ్య (PHF) తన ఆటగాళ్లను భారత ఆటగాళ్లతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితిని, ఘర్షణల జోలికి వెళ్లకూడదని.. కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆదేశించింది. ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోతే, దాన్ని విస్మరించి ముందుకు సాగాలని ఆటగాళ్లు మానసికంగా సిద్ధంగా ఉన్నారన్నారు. ఎలాంటి భావోద్వేగ ప్రతిచర్యలు, సంజ్ఞలను చేయొద్దని సూచించామన్నారు. అయితే, మైదానంలో దీనికి విరుద్ధంగా సీన్ కనిపించిందన్నారు. ఇరుదేశాల ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు, తరువాత పరస్పర గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ హాకీ మ్యాచ్ 3-3తో ఉత్కంఠభరితంగా డ్రా కావడమే కాకుండా.. క్రీడా స్ఫూర్తికి ఉదాహరణగా నిలిచిందని పలువురు పేర్కొంటున్నారు.
🤝 A moment of sportsmanship before the clash! 🇵🇰🇮🇳
Traditional high-fives exchanged between India and Pakistan players ahead of their Sultan of Johor Cup 2025 encounter. 🏑#SultanOfJohorCup | #Hockey | #INDvPAK | #GreenTeam | #OurGameOurPassion | #KhelKaJunoon pic.twitter.com/Ce1N84zToV
— Green Team (@GreenTeam1992) October 14, 2025