ప్రావిడెన్స్: టీ20 వరల్డ్‌కప్(T20 Worldcup) క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్‌పై 84 రన్స్ తేడాతో విజయం సాధించింది. టీ20 క్రికెట్లో కివీస్‌ను ఆఫ్ఘన్ ఓడించడం ఇదే మొదటిసారి. గ్రూప్ సీలో భాగంగా ప్రావిడెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ప్రత్యర్థి ఆప్ఘన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆఫ్ఘన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసింది. గుర్బాజ్, ఇబ్రహీంలు తొలి వికెట్‌కు 103 రన్స్ జోడించారు. గుర్బాజ్ 52 బంతుల్లో 80 రన్స్ చేశాడు. దాంట్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇద్దరూ ఔటైన తర్వాత ఆఫ్ఘన్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అనూహ్య రీతిలో చేతులెత్తేసింది. క్రమక్రమంగా వికెట్లను కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నది. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫారూకీ, రషీద్ ఖాన్లు చెరి నాలుగు వికెట్లు తీసుకున్నారు. కివీస్ బ్యాటర్లను స్థిరపడకుండా చేశారు. గ్లెన్ ఫిలిప్స్, మ్యాట్ హెన్రీ మాత్రమే రెండు అంకెల స్కోర్లు చేశారు. మిగితా బ్యాటర్లు ఎవరూ డబుల్ డిజిట్ చేరుకోలేదు. కివీస్ జట్టు 15.2 ఓవర్లలో 75 రన్స్‌కే ఆలౌటైంది.
Afghanistan put on a clinic with bat and ball against New Zealand to continue their winning momentum 🙌#T20WorldCup | #NZvAFG | 📝 https://t.co/BuSb84vwPX pic.twitter.com/MbUFFuTyBm
— T20 World Cup (@T20WorldCup) June 8, 2024