Asia Cup : తొలిసారి ఆసియా కప్ గెలవాలనుకుంటున్న అఫ్గనిస్థాన్(Afghanistan)కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ నవీన్ ఉల్ హక్ (Naveen Ul Haq) టోర్నీ నుంచి వైదొలిగాడు. భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న నవీన్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దాంతో, అతడు మెగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. ఈ విషయాన్ని సోమవారం ఆ దేశ బోర్డు వెల్లడించింది.
కుడిచేతి వాటం పేసర్ అయిన నవీన్ ఉల్ హక్ గాయపడ్డాడు. అయితే.. రెండో మ్యాచ్ వరకూ కోలుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ. అతడి ఆరోగ్యం మెరుగవ్వని కారణంగా అఫ్గన్ క్రికెట్ బోర్డు (ACB) ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాంతో నవీన్ స్థానంలో రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన అబ్దుల్లా అహ్మద్జాయ్ స్క్వాడ్‌తో చేరుతాడని ఏసీబీ తెలిపింది. ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ యంగ్‌స్టర్ ఆసియా కప్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు.
Afghanistan fast bowler Naveen-ul-Haq is yet to fully recover from a shoulder injury and will take no part in the ongoing Asia Cup ❌
Full story: https://t.co/xQJK1Snio3 pic.twitter.com/tC0BLfX1kI
— ESPNcricinfo (@ESPNcricinfo) September 15, 2025
‘నవీన్ ఉల్ హక్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. అతడి స్థానంలో స్క్వాడ్‌లోకి వచ్చిన అబ్దుల్ అహ్మద్‌జాయ్‌కు అభినందనలు తెలియజేస్తున్నాం’ అని అఫ్గన్ బోర్డు తమ ప్రకటనలో వెల్లడించింది. పదిహేడో సీజన్ ఆసియా కప్‌ను రషీద్ ఖాన్ నేతృత్వంలోని కాబూలీ టీమ్ ఘనంగా ఆరంభించింది. గ్రూప్ బీ తొలి పోరులో హాకాంగ్ జట్టును 94 పరుగుల తేడాతో చిత్తు చేసి బోణీ కొట్టింది. తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 16న బంగ్లాదేశ్‌ను రషీద్ సేన ఢీకొట్టనుంది.
మైదానంలో గొడవపడుతున్న కోహ్లీ – నవీన్
నవీన్ విషయానికొస్తే.. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ(Virat Kohi)తో వివాదంతో వార్తల్లో నిలిచాడు అఫ్గన్ పేసర్. పదహారో సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(LSG)కు ఆడుతున్న సమయంలో మైదానంలో కోహ్లీతో గొడవకు దిగిన ఈ స్పీడ్‌స్టర్ అనంతరం.. స్వీట్ మ్యాంగో పేసర్‌గా గుర్తింపు సాధించాడు.