కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్(Rashid Khan) రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇన్నాళ్లూ వస్తున్న రూమర్స్‌కు అతను చెక్ పెట్టేశాడు. ఓ మహిళతో ఉన్న ఫోటోలు, వీడియోలు ఇటీవల ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. దీంతో రషీద్ రెండో పెళ్లి చేసుకున్నాడని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆ మేటి స్పిన్నర్ తన లైఫ్ పార్ట్నర్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తన రిలేషన్ స్టేటస్ గురించి ఓ పోస్టు పెట్టాడు. తనతో పాటు ఫోటోలో ఉన్న ఆ ఆడపడచు తన అర్ధాంగి అని చెప్పేశాడు. దీంతో అతను రెండో పెళ్లి చేసుకున్న అంశం కన్ఫర్మ్ అయ్యింది.
వాస్తవానికి ఆఫ్ఘన్ బౌలర్ రషీద్ 2024 అక్టోబర్‌లో మొదటి పెళ్లి చేసుకున్నాడు. కాబూల్‌లో ఆ వేడుక జరిగింది. రషీద్‌తో పాటు ఇద్దరు సోదరులు ఆమిర్ ఖలీల్, జకీవుల్లాలు కూడా ఒకే రోజు పెళ్లి చేసుకున్నారు. తన రెండో పెళ్లి గురించి ఇన్‌స్టాలో చెబుతూ.. 2025 ఆగస్టు 2వ తేదీన రెండో పెళ్లి జరిగినట్లు చెప్పారు. ప్రేమ, శాంతి, భాగస్వామ్యాన్ని ఆశించే వ్యక్తిని తాను పెళ్లి చేసుకున్నట్లు రషీద్ పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ఓ ఛారిటీ ఈవెంట్‌కు ఆమెను తీసుకెళ్లాని, అప్పటి నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయని, సూటిగా నిజం చెబుతున్నానని, ఆమె నా భార్య అని, కలిసి జీవిస్తున్నామని, కరుణ.. దయ, అవగాహన ప్రదర్శించిన వారికి రషీద్ థ్యాంక్స్ తెలిపారు.
నెదర్లాండ్స్‌లో జరిగిన రషీద్ ఖాన్ ఛారిటీ ఫౌండేషన్ కార్యక్రమంలో తన రెండో భార్య ఆ క్రికెటర్ హాజరయ్యాడు. ఆఫ్ఘన్ ప్రజల ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, క్లీన్ వాటర్ ప్రమోషన్ కోసం రషీద్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీ20ల్లో రషీద్ ఖాన్ ఓ ఫేమస్ బౌలర్. ఆ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడతను. 108 మ్యాచుల్లో అతను 182 వికెట్లు తీసుకున్నాడు. ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో ఆఫ్ఘన్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు.