Afghanistan Vs New Zealand | నోయిడా: అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య నోయిడా వేదికగా జరగాల్సిన ఏకైక టెస్టు నాలుగు రోజుల నాటకీయ పరిణామాల తర్వాత అధికారికంగా రైద్దెంది. ఈ మ్యాచ్లో టాస్ కూడా పడకపోగా ఒక్క బంతి సైతం పడలేదు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది 8వ సారి కాగా 1998 తర్వాత ఇదే ప్రథమం. కాగా తొలి మూడు రోజులు నోయిడా స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆట సాగకపోగా తర్వాత రెండు రోజులూ వర్షాలతో మ్యాచ్ను రద్దు చేశారు. మ్యాచ్ రద్దవడంపై ఇరు జట్ల హెడ్కోచ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.