దుబాయ్: తొలి ఆరు ఓవర్లలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన నమీబియా బౌలర్లు ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్నారు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్న హజ్రతుల్లా జజాయ్ (33).. జేజే స్మిత్ బౌలింగ్లో మైకాల్ వాన్ లింగెన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత కాసేపటికే రహ్మనుల్లా గుర్బాజ్ (4) కూడా నికోల్ లాఫ్టీ ఈటన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుతిరిగాడు. దీంతో 50 పరుగుల వరకూ వికెట్ కోల్పోని ఆఫ్ఘనిస్థాన్ 68/2తో నిలిచింది. క్రీజులో మొహమ్మద్ షెహజాద్ (30 నాటౌట్) ఉన్నాడు.