అబుధాబి: ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నమీబియా బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ క్రెయిగ్ విలియమ్స్ (1) అవుటవగా ఆ తర్వాత ఏ కోశానా నమీబియా బ్యాట్స్‌మెన్ కోలుకోలేదు. వరుస విరామాల్లో వికెట్లో కోల్పోతూ వచ్చారు. మైకేల్ వాన్ లింగెన్ (11), లాఫ్టీ ఈటన్ (14), గెర్హార్డ్ ఎరాస్మస్ (12), జేన్ గ్రీన్ (1), జేజే స్మిత్ (0), జాన్ ఫ్రైలింక్ (6 నాటౌట్) ఎవరూ నిలబడలేకపోయారు.
డేవిడ్ వీజ్ (20 నాటౌట్) జట్టు పరువు నిలబెట్టేందుకు పోరాడుతున్నాడు. మొత్తం 15 ఓవర్లు ముగిసే సరికి నమీబియా జట్టు 73/7తో నిలిచింది. అతనితోపాటు క్రీజులో ఉన్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు, హమీద్ హసన్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.