అబుధాబి: పసికూన నమీబియాపై ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో నమీబియా ఏ కోశానా పోటీ ఇవ్వలేకపోయింది. తొలి ఓవర్ నుంచే ఆఫ్ఘన్ బౌలర్లు పట్టుబిగిస్తూ వచ్చారు. దీంతో నమీబియా ఆలౌట్ అవడం ఖాయమని అంతా అనుకున్నారు.
కానీ అనూహ్యంగా చివరి వరకూ నిలబడిన నమీబియా బ్యాట్స్మెన్ ఆలౌట్ అవమానాన్ని తప్పించుకున్నారు. నమీబియా ఆటగాళ్లలో డేవిడ్ వీజ్ (26), తప్ప మిగతా ఆటగాళ్లెవరూ రాణించలేదు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్ చెరో మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకోగా.. గులాబ్దీన్ నైబ్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ కూల్చారు.