అబుధాబి: ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్లు దుమ్మురేపడంతో నమీబియా బౌలర్లు తేలిపోయారు. టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ నబీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతున్న ఓపెనర్లు మహమ్మద్ షెహజాద్ (17 నాటౌట్), హజ్రతుల్లా జజాయ్ (32 నాటౌట్) చెలరేగి ఆడారు.
అనతి కాలంలోనే క్రికెట్ ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు తన చివరి మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ కసితోనో ఏమో పసికూన నమీబియాపై ఈ ఇద్దరూ విరుచుకుపడ్డారు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘన్ జట్టు వికెట్లేమీ నష్టపోకుడా 50 పరుగులు చేశారు.