AFG vs IRE | స్కూల్ ఛాంపియన్షిప్ కోసం ఇంటర్నేషనల్ టెస్టు మ్యాచ్ వేదిక మార్పు
AFG vs IRE | స్కూల్ ఛాంపియన్షిప్ కోసం ఏకంగా అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ వేదికనే మార్చారు. అఫ్గానిస్తాన్ - ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఇందుకు వేదికైంది.
AFG vs IRE | ఐసీసీ టెస్టు హోదాలున్న దేశాలు టెస్టు మ్యాచ్ ఆడుతున్నాయంటే అందుకు సంబంధించి కొద్దినెలలు ముందుగానే వేదికల ఎంపిక, షెడ్యూల్, అక్కడి వసతులు, తదితర పనులన్నీ సంబంధిత బోర్డులు చకచకా చేసేస్తాయి. కానీ ఒక స్కూల్ ఛాంపియన్షిప్ కోసం ఏకంగా అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ వేదికనే మార్చారు. అఫ్గానిస్తాన్ – ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఇందుకు వేదికైంది. నేటి నుంచి అబుదాబిలోని ప్రఖ్యాత షేక్ జయేద్ స్టేడియంలో అఫ్గాన్ – ఐర్లాండ్ల మధ్య ఏకైక టెస్టు జరగాల్సి ఉంది. కానీ స్కూల్ ఛాంపియన్షిప్ కారణంగా వేదికను అప్పటికప్పుడు మార్చారు నిర్వహాకులు..
వివరాల్లోకెళ్తే.. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం అఫ్గాన్ – ఐర్లాండ్ ఏకైక టెస్టుకు ఆతిథ్యమివ్వాల్సి ఉండగా అబుదాబి స్కూల్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ కూడా మార్చి 1 నుంచి 3 వరకు అక్కడ జరుగుతుందని స్టేడియం నిర్వాహకులు నేటి ఉదయం ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. మార్చి 1 నుంచి 3 దాకా ఈ స్టేడియంలో నిర్వహించే ఛాంపియన్‌షిప్‌లో సుమారు వెయ్యి టీమ్‌లు, 25వేల మంది అథ్లెట్లు పాల్గొననున్నట్టు సమాచారం. దీంతో ఆఖరి నిమిషంలో ఉన్నఫళంగా అఫ్గాన్ – ఐర్లాండ్ టెస్టు వేదికను అబుదాబిలోనే ఉన్న టోలరెన్స్ ఓవల్‌కు షిఫ్ట్ చేశారు. 12వేల సీటింగ్ కెపాజిటీ ఉన్న ఈ స్టేడియం అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వడం ఇదే ప్రథమం. అంతమకుందు ఈ స్టేడియం 19 టీ20 (అంతర్జాతీయ) మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది.
Afghanistan-Ireland Test match gets shifted from Sheikh Zayed Stadium to Tolerance Oval less than 2 days before the match!
This is because it was informed at the last minute that Sheikh Zayed Stadium is no longer available to host 5-day cricket.
Tolerance Oval, with hardly any… pic.twitter.com/e8KsHlbkBg
— Kausthub Gudipati (@kaustats) February 26, 2024
అయితే వేదిక మార్పు నిర్ణయంపై ఇరు జట్లూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. రెండు సెషన్లు మాత్రమే ఆడి తొలి రోజు టీ విరామానికి ముందే ఆలౌట్ అయింది. అఫ్గాన్ జట్టు.. 54.5 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఐర్లాండ్.. 6 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

