న్యూఢిల్లీ: అప్ఘానిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఇబ్రహీం జడ్రాన్ తన 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి అఫ్ఘానిస్థాన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ 75 పరుగులతో ఉన్నాడు. మరో బ్యాటర్ రహమత్ షా అతనికి తోడుగా క్రీజులోకి వచ్చాడు.
మొత్తానికి 17 ఓవర్ల ఆట ముగిసే సమయానికి అఫ్ఘానిస్థాన్ ఒక వికెట్ నష్టపోయి 115 పరుగులు చేసింది. అఫ్ఘాన్ ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ వీర విహారం చేయడంతో తొలి 10 ఓవర్లలో అప్ఘానిస్థాన్‌కు భారీగా పరుగులొచ్చాయి.