న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ప్రపంచకప్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ వీర బాదుడు బాదుతున్నాడు. కేవలం 33 బంతుల్లో 2 సిక్సులు, 7 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దాంతో ప్రపంచకప్‌లో అర్ధసెంచరీ సెంచరీ చేసిన మూడో అఫ్ఘాన్ ఓపెనర్‌గా గుర్బాజ్ రికార్డు నెలకొల్పాడు.
గుర్బాజ్ కంటే ముందు 2019 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై రహమత్ షా, 2015 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్పై జావేద్ అహ్మదీ మాత్రమే ఓపెనర్లుగా వచ్చి అర్ధసెంచరీలు చేశారు. రహమత్ షా 62 పరుగులు, జావేద్ అహ్మదీ 51 పరుగులు చేశారు. ఇప్పుడు రహమానుల్లా 50 పరుగులతో ఆడుతున్నాడు.