హైదరాబాద్, ఆట ప్రతినిధి: నాలుగేండ్ల చిన్నోడు అద్వైత్‌రెడ్డి.. నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు చెస్ ట్రైనర్‌గా నాలుగేండ్ల ఆరు నెలల అద్వైత్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఈ చెస్ చిచ్చరపిడుగు 51 మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు నిర్విరామంగా 30 గేమ్‌లలో విజయం సాధించాడు.
సినీ నటి మంచు లక్ష్మి కూతురు నిర్వాణ (2021), అల్లు అర్జున్ కూతురు అర్హ (2022) నమోదు చేసిన రికార్డులను అద్వైత్ తాజాగా తిరుగరాశాడు. నార్సింగికి చెందిన అద్వైత్ తండ్రి సందేశ్రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా, తల్లి హిరణ్మయి గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. సీజార్ చెస్ అకాడమీలో చదరంగం నేర్చుకున్న అద్వైత్ ప్రస్తుతం ఓక్రిడ్జ్ స్కూల్లో చదువుతున్నాడు.