BBL : టీ20 మ్యాచ్‌లో 200 టార్గెట్‌ను ఛేదించడం చాలా కష్టం. అలాంటిది అలాంటిది ఆస్ట్రేలియన్ టీ20 లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ 230 పరుగుల భారీ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో ఆ జట్టు కొత్త రికార్డు క్రియేట్ చేసింది. దాంతో, ఈ లీగ్‌లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. హొబర్ట్ హరికేన్‌తో జరిగిన మ్యాచ్‌లో 230 పరుగులు ఛేజింగ్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అడిలైడ్ స్ట్రైకర్స్ కెప్టెన్ మాట్ షోర్ట్ సెంచరీతో చెలరేగాడు. అతనికి క్రిస్ లిన్ (64) సహకారం అందించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు హొబర్ట్ హరికేన్ జట్టు పేరిట ఉంది. 2017 జనవరి 12న మెల్బోర్న్ రెనెగేడ్స్‌పై ఈ జట్టు 233 పరుగులను ఛేదించింది.
టీ20ల్లో ఆడిలైడ్ స్ట్రైకర్స్ రికార్డులు బద్ధలు కొట్టడం ఇది రెండోసారి. పోయిన ఏడాది ఈ సీజన్లోనే ఈ జట్టు సిడ్నీ థండర్స్‌ను 15 పరుగులకే ఆలౌట్ చేసింది. పేసర్ హెర్నీ థార్న్టన్ 5/3 ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆడిలైడ్ స్ట్రైకర్స్ 124 పరుగుల భారీ తేడాతో గెలిచింది. టీ20ల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా సిడ్నీ థండర్స్ చెత్త రికార్డు మూటగట్టుకుంది.
Pandemonium at the Adelaide Oval!
Unforgettable knock from Matt Short #BBL12 pic.twitter.com/s6Lcgc7qt9
— KFC Big Bash League (@BBL) January 5, 2023