కౌలాలంపూర్ : మలేసియా ఇన్విటేషనల్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో యువ స్విమ్మర్, నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ అయిదు స్వర్ణాలతో మెరిశాడు. ఇందుకు సంబంధించిన వివరాలను మాధవన్ సామాజిక మాధ్యమంలో పంచుకున్నాడు. వివిధ వయో విభాగాలకు నిర్వహించిన ఈ చాంపియన్‌షిప్‌లో వేదాంత్ 50మీ., 100మీ., 200మీ., 400మీ., 1500మీ.లలో స్వర్ణాలు గెలుచుకున్నాడు. ఇందులో రెండు స్వర్ణాలను వ్యక్తిగత ఉత్తమ టైమింగ్‌తో సొంతం చేసుకున్నాడు. దీనితో వేదాంత్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.