India-Pakistan match | క్రికెట్ అభిమానులకు శుభవార్త.. కొలంబోలో పొడి వాతావరణం.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు వరుణ గండం తొలగినట్టే..!
India-Pakistan match | ఆసియాకప్-2023 సూపర్-4లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరుగనుంది. అయితే, శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగాల్సిన ఈ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉన్నది.
కొలంబో: ఆసియాకప్-2023 సూపర్-4లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరుగనుంది. అయితే, శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగాల్సిన ఈ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉన్నది. కొలంబోలో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందా.. లేదంటే గ్రూప్ స్థాయి మ్యాచ్‌లాగే ఈ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దవుతుందా అనే అనుమానాలు నెలకొని ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కొలంబోలో వాతావరణం పొడిగా ఉందని తెలిపింది. ప్రేమదాస స్టేడియంపై కేవలం తేలికపాటి మబ్బులు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు ప్రేమదాస స్టేడియంపై ఆకాశాన్ని ఫొటో తీసి ట్వీట్ చేసింది. మరోవైపు భారత వికెట్ కీపర్, బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా స్టేడియంపై పొడి వాతావరణాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారకపోవచ్చనే ఆశలు చిగురిస్తున్నాయి. ఇదిలావుంటే ఇవాళ మధ్యాహ్నం తర్వాత ప్రేమదాస స్టేడియం పరిసరాల్లో వర్షం పడే అవకాశం 49 శాతం వరకు ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 51 శాతం మాత్రం వర్షం పడే అవకాశం లేదంటున్నారు. అయితే, తాజా వాతావరణ పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నట్లు సమాచారం.
#WATCH | Sri Lanka: Visuals from Colombo where India will face Pakistan in the Super 4 stage of the Asia Cup 2023. pic.twitter.com/laxsjLJWyW
— ANI (@ANI) September 10, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

