చండీగఢ్ : రానున్న విజయ్ హజారే వన్డే టోర్నీ కోసం ఎంపిక చేసిన పంజాబ్ జట్టులో స్టార్ క్రికెటర్లు శుభ్‌మన్‌గిల్, అభిషేక్‌శర్మ, అర్ష్‌దీప్‌సింగ్ చోటు దక్కించుకున్నారు. ప్రతీ ఒక్కరు దేశవాళీ టోర్నీలో ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలకు అనుగుణంగా టీమ్ఇండియా క్రికెటర్లు ఆయా రాష్ట్ర జట్ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విజయ్ హజారే వన్డే టోర్నీలో పంజాబ్‌కు గిల్, అభిషేక్, అర్ష్‌దీప్ ఆడనున్నారు. ముంబై, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌తో కలిసి గ్రూపు-సీలో ఉన్న పంజాబ్ తమ తొలి మ్యాచ్‌లో ఈనెల 24న మహారాష్ట్రతో ఆడనుంది.