IND vs NZ : పొట్టి సిరీస్ తొలి మ్యాచ్‌లోనే భారత బ్యాటర్లు శివాలెత్తిపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(84)విధ్వంసక అర్ధ శతకంతో చెలరేగగా.. రింకూ సింగ్(44 నాటౌట్) తనమార్క్ స్ట్రోక్ ప్లేతో రెచ్చిపోయాడు. ఓపెనర్లు విఫలైమనా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(32) తో కలిసి మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు అభిషేక్. డెత్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా(౨౫), రింకూలు బ్యాట్ ఝులిపించగా నాగ్‌పూర్‌లో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా 238 రన్స్ కొట్టింది.
టాస్ ఓడిన భారత జట్టుకు తన మొదటి ఓవర్లోనే జేమీషన్ షాకిచ్చాడు. ఓపెనర్ సంజూ శాంసన్(10) వికెట్ కోసం ఫీల్డర్‌ను మిడ్‌వికెట్‌కు మార్చి ఫలితం రాబట్టాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్(8) మొదటి బంతినే ఫోర్‌గా మలిచాడు. అయితే.. డఫ్పీ ఓవర్లో మిడ్వికెట్లో ఆడబోయిన అతడు అక్కడే కాచుకొని ఉన్న చాప్మన్ చేతికి చిక్కాడు. దాంతో.. వద్దే రెండో వికెట్ పడింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (32) ఎదుర్కొన్న మొదటి బంతికే ఫోర్ కొట్టాడు. అనంతరం జేమీసన్ ఓవర్లో అభిషేక్ శర్మ(84) స్ట్రెయిట్‌గా భారీ సిక్సర్ సంధించాడు. వీరిద్దరి జోరుతో పవర్ ప్లేలో 68 పరుగులు చేసింది.
Going, going, GONE! 🚀
🎥 Rinku Singh with a fabulous final flourish to power #TeamIndia to 2⃣3⃣8⃣/7 👏
Scorecard ▶️ https://t.co/ItzV352h5X#INDvNZ | @IDFCFIRSTBank | @rinkusingh235 pic.twitter.com/BGTv4m3NxD
— BCCI (@BCCI) January 21, 2026
గ్లెన్ ఫిలిప్స్ వేసిన 8వ ఓవర్లో అభిషేక్ మరింత రెచ్చిపోయాడు. వరుసగా తొలి మూడు బంతుల్ని బౌండరీ లైన్ దాటించి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 25 కంటే తక్కువ బంతుల్లోనే అతడు మెరుపు హాఫ్ సెంచరీ బాదేయడం ఇది ఎనిమిదోసారి. మంచి టచ్‌లో కనిపించిన సూర్య బిగ్ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు.
8⃣4⃣ runs
3⃣5⃣ deliveries
5⃣ fours and 8⃣ sixesThat was an absolutely breathtaking knock from Abhishek Sharma 🫡🙌
Updates ▶️ https://t.co/ItzV352h5X#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank | @OfficialAbhi04 pic.twitter.com/P0gGYVLAWq
— BCCI (@BCCI) January 21, 2026
సెంచరీకి చేరువైన అభిషేక్‌ను ఇష్ సోధీ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా( 25) ఉన్నంతసేపు దంచేసి స్కోర్ 200 దాటింది. ఆఖర్లో రింకూ సింగ్(44 నాటౌట్) తన స్టియల్ విధ్వంసం సృష్టించాడు. చివరి ఓవర్లో రెండేసి సిక్సర్లు, ఫోర్లతో 24 రన్స్ పిండుకొని స్కోర్ దాటించాడు. ఫలితంగా కివీస్‌కు 239 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా.