DC vs LSG : చావోరేవో పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దంచేస్తున్నారు. ఖాతా తెరవకుండానే ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్(0) వెనుదిరిగినా.. అభిషేక్ పొరెల్(58) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ ఎడిషన్లో రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే.. నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద పూరన్ చేతికి దొరికాడు. అక్కడితో పొరెల్ విధ్వంసం ముగిసింది. 12 ఓవర్లకు ఢిల్లో 2 వికెట్ల నష్టానికి 115 పరుగులు స్కోర్ చేసింది.
Second fifty of the season for Abishek Porel 👏👏
He’s looking in 🔝 touch for @DelhiCapitals ✨
Follow the Match ▶️ https://t.co/qMrFfL9gTv#TATAIPL | #DCvLSG pic.twitter.com/51UYCqZ08y
— IndianPremierLeague (@IPL) May 14, 2024
తొలి ఓవర్లోనే ఫ్రేజర్ ఔటయ్యాక షాయ్ హోప్(38) అండగా పొరెల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌలర్ మారినా బంతి లక్ష్యం బౌండరీయే అన్నట్టుగా చిచ్చరపిడుగు చెలరేగాడు. హోప్ సైతం దంచడంతో ఈ ఇద్దరూ రెండో వికెట్కు 92 రన్స్ జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ ద్వయాన్ని బిష్ణోయ్ విడదీశాడు. హోప్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్(10) ఆచితూచి ఆడుతున్నాడు.