ICC Rankings : ఆసియా కప్‌లో తొలి పోరుకు ముందే ఐసీసీ ర్యాంకింగ్స్(ICC Rankings)లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. టీ20 బ్యాటర్ల జాబితాలో ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. యువ చిచ్చరపిడుగు తిలక్ వర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఎడమ చేతివాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ టాప్- 10లోకి దూసుకొచ్చాడు. ఒక ర్యాంక్ మెరుగుపరచుకున్న ఈ పంజాబీ స్పీడ్‌స్టర్ పదో స్థానం నిలిచాడు.
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బౌలర్ల ర్యాంకిగ్స్‌లో అర్ష్‌దీప్‌తో కలిపి ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు. మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి నాలుగు, రవి బిష్ణోయ్ ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. అయితే.. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ ఒక ర్యాంక్ కోల్పోయి 11వ స్థానంలో నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్‌లు 26, 34వ ర్యాంక్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో అక్షర్ పటేల్ ఒక స్థానం ఎగబాకి.. 13వ ర్యాంక్ సాధించాడు. ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో హార్దిక్ పాండ్యా 252 రేటింగ్ పాయింట్స్‌తో నంబర్ వన్ ర్యాంక్ కాపాడుకున్నాడు.
A new T20I opening combo for Team India 🇮🇳🤝
Shubman Gill will partner childhood friend Abhishek Sharma at the top ✨#AsiaCup2025 #UAEvIND pic.twitter.com/KzeGnYZpk0
— Sport360° (@Sport360) September 10, 2025
వన్డే ఫార్మాట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (Shumbman Gill) నంబర్ వన్ ర్యాంక్‌లో ఉండగా.. రోహిత్ శర్మ రెండు, విరాట్ కోహ్లీ నాలుగో ర్యాంకులో నిలిచారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్(Jofra Archer) టాప్ 5లోకి దూసుకొచ్చాడు. . దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో వికెట్ల వేటతో రెచ్చిపోయిన ఈ స్పీడ్‌స్టర్ ఏకంగా 16 స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్ సాధించాడు. సఫారీ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ నంబర్ 1 ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
Jofra Archer moves up 16 places in the ICC rankings after his brilliant spell in the third ODI against South Africa 🏴📈#JofraArcher #Cricket pic.twitter.com/LknL5ATfGr
— Wisden (@WisdenCricket) September 10, 2025