IPL 2025 : లక్నో మైదానంలో దంచికొడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఓపెనర్లు స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. మొదట అభిషేక్ శర్మ(34)ను ఎంగిడి పెవిలియన్ పంపగా.. కాసేపటికే భువనేశ్వర్ ఓవర్లో ట్రావిస్ హెడ్(17) ఔటయ్యాడు. భువనేశ్వర్ ఓవర్లో పెద్ద షాట్ ఆడే క్రమంలో రొమారియో షెపర్డ్‌కు సులువైన క్యాచ్ ఇచ్చాడు హెడ్. 54 వద్దే రెండు వికెట్లు పడిన జట్టును ఇషాన్ కిషన్(9 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్(8 నాటౌట్)లు ఆదుకునే పనిలో ఉన్నారు. దాంతో, 6 ఓవర్లకు హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.
టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. కరోనా నుంచి కోలుకున్న ట్రావిస్ హెడ్(17) యశ్ దయాల్ వేసిన తొలి ఓవర్లో బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత భువనేశ్వర్‌కు చుక్కలు చూపిస్తూ అభిషేక్ శర్మ(34) తనదైన స్టయిల్లో విధ్వంసం కొనసాగించాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 రన్స్ సాధించాడు. అతడు బలంగా కొట్టిన బంతి స్టాండ్స్‌లోని టాటా కర్వ్ కారు అద్ధానికి తాకడంతో.. అద్దం బద్ధలైంది.
The dream of every cricket got fulfilled ! 🥰🤩
Courtesy : Abhishek Sharma #RCBvSRH #IPL2025 #Orangearmy pic.twitter.com/hNgPxrpb3h
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) May 23, 2025
అనంతరం ఎంగిడి బౌలింగ్‌లో అభిషేక్ కళ్లు చెదిరే సిక్సర్ బాదడంతో 3.3 ఓవర్లకే స్కోర్ 50 దాటింది. ఆ తర్వాత ఫోర్ బాదిన అభిషేక్ టీ20ల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. లెగ్ సైడ్‌లో భారీ షాట్‌కు యత్నించిన అభి.. ఫిల్ సాల్ట్ చేతికి చిక్కాడు. దాంతో, 54 వద్ద ఆరెంజ్ ఆర్మీ తొలి వికెట్ పడింది.
Just when it looked dangerous…
Lungi Ngidi & Bhuvneshwar Kumar break the opening storm with back-to-back punches 👊#SRH end the powerplay at 71/2.
Updates ▶ https://t.co/sJ6dOP9ung#TATAIPL | #RCBvSRH | @RCBTweets pic.twitter.com/Jsl09zKFBc
— IndianPremierLeague (@IPL) May 23, 2025
టీ20 క్రికెట్లో నాలుగు వేల పరుగులు సాధించిన అభిషేక్ అత్యధిక స్ట్రయిక్ రేటుతో రికార్డు నెలకొల్పాడు. ఈ చిచ్చరపిడుగు అంతర్జాతీయంగా మూడో బ్యాటర్‌గా నిలిచాడు. అభి.. 166.05 స్ట్రయిక్ రేటుతో 4,002 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ (Finn Allen) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 170.93 స్ట్రయిక్ రేటుతో 4 వేల రన్స్ బాదాడు. రెండో స్థానంలో విండీస్ వీరుడు ఆండ్రూ రస్సెల్ ఉన్నాడు. ఈ ఆల్‌రౌండర్ 168.84 స్ట్రయిక్ రేటుతో 9,175 రన్స్ కొట్టాడు. ఆసీస్ కుర్రాడు టిమ్ డేవిడ్.. గ్రాండ్హొమ్లు నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.