IPL 2023 : ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 9 పరుగుల తేడాతో ఓడించింది. ఈ లీగ్‌లో మూడో విజయం సాధించింది. అభిషేక్, క్లాసెన్ అర్థ సెంచరీలు బాదడంతో హైదరాబాద్ 197 రన్స్ చేసింది. ఆ తర్వాత మిచెల్ మార్ష్(63), ఫిలిఫ్ సాల్ట్(59) రాణించినా ఢిల్లీ మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో, హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలనుకున్న వార్నర్ సేనకు సొంత మైదనాంలో నిరాశే ఎదురైంది.
ఢిల్లీకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో బంతికే డేవిడ్ వార్నర్(0) బౌల్డయ్యాడు. ఆ తర్వాత ఫిలిఫ్ సాల్ట్(59), మిచెల్ మార్ష్(63) ఢిల్లీని ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 112 రన్స్ కొట్టారు. మార్కండే సాల్ట్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాతి ఓవర్లో మనీశ్ పాండే(1)ను క్లాసెన్ స్టంపౌట్ చేశాడు. ఆ వెంటనే ప్రియం గార్గ్(10), సర్ఫరాజ్ ఖాన్(9) డగౌట్‌కు క్యూ కట్టారు. బౌలర్లలో మయాంక్ మార్కండే మూడు, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఒక్కో వికెట్ తీశారు.
Innings break!
Fifties from Abhishek Sharma & Heinrich Klaasen power @SunRisers to a commanding first-innings total of 197/6 👌🏻👌🏻
Scorecard ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/gqeYzvwZaN
— IndianPremierLeague (@IPL) April 29, 2023
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దంచికొట్టారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(67), హెన్రిచ్ క్లాసెన్(53 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగారు. దాంతో, మరక్రం సేన 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు కొట్టింది. ఒక దశలో హైదరాబాద్ 150 రన్స్ చేయడమే కష్టం అనిపించింది. కానీ, అభిషేక్, అబ్దుల్ సమద్(28), క్లాసెన్ ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌తో ఆరంగేట్రం చేసిన అకీల్ హొసేన్(16 నాటౌట్) రాణించాడు. మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ , ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.