Abhimanyu Eshwaran | రంజీ హీరోకు మళ్లీ మొండిచేయి.. రుతురాజ్ స్థానంలో బెంగాల్ ఓపెనర్‌కు పిలుపు
Abhimanyu Eshwaran : రంజీ ట్రోఫీల్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)కు మరోసారి నిరాశే మిగిలింది. కుడి చేతివేలి గాయం కారణంగా దక్షిణాఫ్రికా(South Africa)తో టెస్టు సిరీస్ నుంచి వైదొలిగిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) స్థానంలో చోటు...
Abhimanyu Eshwaran : రంజీ ట్రోఫీల్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)కు మరోసారి నిరాశే మిగిలింది. కుడి చేతివేలి గాయం కారణంగా దక్షిణాఫ్రికా(South Africa)తో టెస్టు సిరీస్ నుంచి వైదొలిగిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) స్థానంలో చోటు ఆశించిన అతడికి సెలెక్టర్లు మొండిచేయి చూపించారు. రెండు టెస్టుల కోసం బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Eshwaran)ను సెలెక్ట్ చేశారు.
తొలుత స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన 28 ఏండ్ల అభిమన్యు.. ఈ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు. భారత్, సఫారీల మధ్య సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26న తొలి టెస్టు జరుగనుంది. అనంతరం జవనరి 3న కేప్‌టౌన్‌లో రెండో టెస్టు షురూ కానుంది.

భారత టెస్టు స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వీ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, శార్థూల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), ప్రసిధ్ కృష్ణ, కేఎస్ భరత్(వికెట్ కీపర్).
బెంగాల్ ఓపెనర్‌గా రాణిస్తున్న ఈశ్వరన్‌కు ఫస్ట్ క్లాస్‌లో మంచి రికార్డు ఉంది. ఈ కుడిచేతివాటం బ్యాటర్ లిస్ట్ ఏ 88 మ్యాచుల్లో 3,847 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 9 సెంచరీలు, 23 అర్థ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్.. 149. ఇక టీ20ల్లో ఈశ్వరన్ ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో కలిపి 976 రన్స్ బాదాడు.
ఇవి కూడా చదవండి
- Beth Mooney | రిలాక్స్ అవుదామని క్రీజు వీడింది.. ఊహించని రనౌట్‌తో కంగుతిన్నది.. వీడియో
- Shoe Hurling Incident: సీఎం ప్రయాణిస్తున్న బస్సుపై షూ దాడి.. మహిళా జర్నలిస్టుపై కేసు నమోదు
- Tejashwi Yadav | మనీలాండరింగ్ కేసు.. ఉప ముఖ్యమంత్రి తేజస్వీకి ఈడీ సమన్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

