దుబాయ్: ఐపీఎల్ 2021( IPL 2021 )లో సెకండ్ ఫేజ్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో అన్ని టీమ్స్ ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. తమ టీమ్‌నే రెండుగా చేసిన ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. అందులో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ కూడా ఓ మ్యాచ్ ఆడింది. ఇందులో ఆ టీమ్ స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ చెలరేగిపోయాడు. కోహ్లి, సిరాజ్, డాన్ క్రిస్టియన్లాంటి వాళ్లు క్వారంటైన్లో ఉండగా.. మిగతా ప్లేయర్స్ హర్షల్ పటేల్, దేవ్‌దత్ పడిక్కల్‌ల నేతృత్వంలో రెండు టీమ్స్‌గా విడిపోయి ఈ మ్యాచ్ ఆడారు.
ఆర్సీబీ ఎ టీమ్ తరఫున ఆడిన ఏబీ.. కేవలం 46 బంతుల్లోనే 104 పరుగులు చేయడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. మహ్మద్ అజారుద్దీన్ కూడా 43 బంతుల్లో 66 పరుగులు చేయడంతో ఆర్సీబీ ఎ టీమ్ 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. ఐపీఎల్ 2021లో మిగిలిపోయిన మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి ముందు ఏబీ భీకర ఫామ్‌లో ఉండటం ఆర్సీబీ ఫ్యాన్స్‌ను ఆనందానికి గురి చేస్తోంది. అయితే ఇంత భారీ స్కోరును కూడా ఆర్సబీ బీ టీమ్ చేజ్ చేయడం విశేషం. ఓపెనర్ కేఎస్ భరత్ 47 బంతుల్లో 95 పరుగులు చేయగా.. కెప్టెన్ పడిక్కల్ 21 బంతుల్లో 36 రన్స్‌తో రాణించాడు.
Bold Diaries: RCB’s Practice Match
— Royal Challengers Bangalore (@RCBTweets) September 15, 2021
AB de Villiers scores a century, KS Bharat scores 95 as batsmen make merry in the practice match between Devdutt’s 11 and Harshal’s 11.#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/izMI4LCSG1