లార్డ్స్: ఇంగ్లండ్తో లార్డ్స్ టెస్టు నాలుగో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడితే మ్యాచ్లో ఫలితం మరో విధంగా ఉండేదని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఛేదనలో టాప్-5 బ్యాటర్లు ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగితే లోయరార్దర్లో జడ్డూ పని సులువయ్యేదని మిస్టర్ 360 అభిప్రాయపడ్డాడు. ‘నా అభిప్రాయం ప్రకారం భారత టాప్-5 బ్యాటర్ల అప్రోచ్ తప్పుగా ఉంది.
టీ తర్వాత జడ్డూ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాడు. కానీ అంతకుముందే టాపార్డర్ బ్యాటర్లు ఇంగ్లండ బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారిమీద ఒత్తిడి పెంచాల్సింది’ అని అన్నాడు. మ్యాచ్లో ఓడినప్పటికీ భారత బౌలింగ్ చాలా బాగుందని ఏబీడీ ప్రశంసలు కురిపించాడు.