ముంబై: కొవిడ్‌పై పోరులో భాగంగా విరాళాలు సేకరించడానికి బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. చెస్ మాజీ వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో ఓ గేమ్ ఆడనున్నాడు. ఈ నెల 13న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఈ గేమ్ జరగనుంది. చెస్కామ్ అనే యూట్యూబ్ చానెల్ ఈ గేమ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు చెస్.కామ్ తన ట్విటర్లో ప్రకటించింది. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసింది. చెస్ లవర్ అయిన సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్, మాజీ వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేయడానికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వండి అని ట్వీట్ చేసింది.
గతంలోనూ ఈ ఇద్దరూ చెస్ ఆడిన ఫొటోను ఈ ట్వీట్ కామెంట్స్‌లో ఓ అభిమాని షేర్ చశాడు. ఈ గేమ్ అద్భుతంగా సాగబోతోందని పలువురు అభిమానులు అభిప్రాయపడ్డారు. ఈ ఈవెంట్‌కు చెక్‌మేట్ కొవిడ్ అనే పేరు పెట్టారు. కొవిడ్‌తో బాధపడుతున్న చెస్ ప్లేయర్స్, వాళ్ల కుటుంబ సభ్యులకు ఈ డబ్బును అందించనున్నారు. ఆమిర్ఖాన్తోపాటు ఆ రోజు మరికొందరు సెలబ్రిటీలు కూడా ఆనంద్‌తో చెస్ ఆడనున్నారు.
The moment you all have been waiting for!
— Chess.com – India (@chesscom_in) June 7, 2021
Superstar Aamir Khan, an ardent chess lover, will be playing an exhibition match against former world champion Vishy Anand! (@vishy64theking)
Please feel free to donate generously to make this event a success. https://t.co/mgOmSwr54n pic.twitter.com/YFyK1oeka2