ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంగ్లా ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఢాకా క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న మహబూబ్ అలీ జకీ (59) శనివారం మధ్యాహ్నం మైదానంలో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం సిల్హెట్ వేదికగా జరగాల్సిన ఢాకా, రాజ్షాహి వారియర్స్‌తో మ్యాచ్‌కు ముందు ఈ ఘటన జరిగింది.
మ్యాచ్ కోసం మైదానంలోకి వచ్చిన అలీ.. ఉన్నఫళంగా కుప్పకూలిపోయాడు. దీంతో జట్టు సభ్యులు, వైద్య సిబ్బంది వచ్చి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో అతడిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించాడని వైద్యులు తేల్చారు.