కొలంబో: లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) ఆరో ఎడిషన్ ఆరంభానికి ముందే ఫిక్సింగ్ కలకలం రేగింది. డిఫెండింగ్ చాంపియన్ జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీకి సహ యజమానిగా ఉన్న మన్జోత్ కర్లా ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్లా గతంలో భారత అండర్-19 జట్టుకు ఆడాడు.
పృథ్వీ షా సారథ్యంలో 2018 అండర్-19 ప్రపంచకప్ ఆడిన జట్టులో అతను కీలక ఆటగాడు. నిరుడు ఈ ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెట్టిన మన్జోత్.. కొద్దిరోజుల క్రితం ఒక క్రికెటర్‌కు డబ్బులు ఇవ్వజూపాడని లంక ఆటగాళ్లు, జాఫ్నాకే ఆడుతున్న భానుక రాజపక్స, అవిష్క ఫెర్నాండో, దునిత్ వెల్లలాగె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కర్లాను అదుపులోకి తీసుకున్నారు.