అహ్మాదాబాద్: గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్లో ఓ గమ్మత్తు ఘటన చోటుచేసుకున్నది. ఎంఎస్ ధోనీ(MS Dhoni) అభిమాని ఒకరు .. మైదానంలోకి దూసుకువచ్చిన అతనికి పాదాభివందనం చేశాడు. చెన్నై జట్టు ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. చివరి ఓవర్లో ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఓ అభిమాని సడెన్‌గా గ్రౌండ్లోకి దూసుకువచ్చాడు. ఆ సమయంలో ధోనీ క్రీజ్ నుంచి పరుగెత్తుతున్నట్లు కాస్త నటించాడు. అక్కడ ఉన్న ఫీల్డ్ అంపైర్ కూడా ధోనీ ఫ్యాన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ పరుగులు తీస్తూ వచ్చిన ఆ అభిమాని.. ధోనీ ముందు మోకరిల్లాడు. పాదాభివందనం చేశాడు. ధోనీ కూడా అతన్ని పైకి లేపి హత్తుకున్నాడు. ఆ తర్వాత సెక్యూర్టీ గ్రౌండ్లోకి వచ్చి ఆ అభిమానిని తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 35 రన్స్ తేడాతో విజయం సాధించింది.
DEMIGOD @MSDhoni. 🙏🙏 pic.twitter.com/ozv618CsEj
— Dhoni Tharane 5️⃣ 🦁 (@Tharane__Talks) May 10, 2024
The way he is talking to that guy 🥹💛
Vo bol Raha hoga security valo ko bolo fine na lagaye 😂#MSDhoni𓃵 pic.twitter.com/SXIYWaUXkG— Nishhh (@nishant_dadhich) May 10, 2024