న్యూఢిల్లీ: భగవానీ దేవి డాగర్(Bhagwani Devi Dagar)కు 95 ఏళ్లు. ఆ బామ్మ ఓ సూపర్ అథ్లెట్. వయసు పెరుగుతున్నా.. మెడల్స్ కొట్టాలన్న కాంక్ష మాత్రం ఆమెలో తగ్గలేదు. ఈ ఏడాది పోలాండ్లోని టొరున్లో జరిగిన తొమ్మిదవ వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్షిప్(World Master Athletics Indoor Championship)లో ఆమె సత్తా చాటింది. ఈ ఏడాది మూడు ఈవెంట్లలో ఆమెకు బంగారు పతకాలు(gold medals) లభించాయి. 60 మీటర్ల రన్నింగ్, షాట్పుట్, డిస్కస్ త్రో ఈవెంట్లలో భగవానీ దేవికి గోల్డ్ మెడల్స్ దక్కాయి. ఆ బామ్మ గత ఏడాది కూడా వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్షిప్లో మెడల్స్ సాధించింది. 2022లో ఒక గోల్డ్, రెండు బ్రాంజ్ మెడల్స్ ఆమె కైవసం చేసుకున్నది.