ఢిల్లీ : భారత్‌కు చెందిన తొమ్మిదేండ్ల పిల్లాడు ఆరిత్ కపిల్.. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై గెలిచినంత పనిచేశాడు. ఓ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ వేదికగా జరిగిన ‘ఎర్లీ టైటిల్డ్ ట్యూస్డే’ టోర్నీలో భాగంగా కార్ల్సన్తో తలపడ్డ ఆరిత్.. తనదైన ఎత్తులతో చెస్ దిగ్గజానికి చెమటలు పట్టించాడు.
ఆఖరి వరకూ గేమ్‌ను సొంతం చేసుకునే రేసులో ఉన్న ఆరిత్.. చివర్లో తనకు లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తడబడటంతో గేమ్ డ్రాగా ముగిసింది. ఇదిలాఉండగా టోర్నీలో భారత్‌కే చెందిన వి. ప్రణవ్.. 10 పాయింట్లతో అగ్రస్థానాన నిలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు.