రోడ్స్ (గ్రీస్) : ప్రపంచ క్యాడెట్స్, యూత్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత వర్ధమాన చెస్ ప్లేయర్ అశ్వథ్ కౌశిక్ చేజిక్కించుకున్నాడు. గ్రీస్ వేదికగా జరిగిన అండర్-8 విభాగంలో ఆరేండ్ల అశ్వథ్. తొమ్మిది రౌండ్లలో 8.5 పాయింట్లు ఖాతాలో వేసుకుని చాంపియన్‌గా అవతరించాడు.
ఈ టోర్నీలో టాప్ సీడ్స్ మోడిత్ ఆరోహ్ ముత్యాలపాటి (కెనడా), రాఘవ్ పాథక్ (నెదర్లాండ్స్)ను ఓడించి కౌశిక్ సత్తా చాటాడు. టైటిల్ సాధించడంపై కౌశిక్ కోచ్, ఫిడె మాస్టర్ గుత్తుల బాలాజీ హర్షం వ్యక్తం చేశారు. అద్భుత ప్రదర్శనతో కౌశిక్ త్వరలోనే అత్యంత పిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్ హోదా పొందుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.