కాచిగూడ, ఏప్రిల్ 26: బర్కత్‌పుర ప్రాం తానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీనీ విక్టోరియా మరో రికార్డును నెలకొల్పారు. శ్రీలంకలోని తలైమీనార్ నుంచి రామేశ్వరం ధనుష్కోడి (తమిళనాడు) వరకు ఐదుగురు మహిళలతో సముద్రాన్ని ఈది రికార్డు నమోదు చేసుకున్నారు.యూనిఫ్లై సంస్థ, స్విమ్లైప్ సహాకారంతో ఓడబ్లూస్ఎఫ్ ఉపాధ్యక్షుడు సతీశ్‌కుమార్ పర్యవేక్షణలో ఈ ఐదుగురు.. రికార్డు సృష్టించారు. క్వీనీ విక్టోరియా సారథ్యంలో న్యూఢిల్లీకి చెందిన ఆర్సీ, మౌనిక (తెలంగాణ), స్మిత (మహారాష్ట్ర), ధాత్రిక మండవ (విజయవాడ) బృందం శ్రీలంకలోని తలైమీనార్లో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు స్విమ్మింగ్ ప్రారంభించి మధ్యాహ్నం 12.10 నిమిషాలకు తమ గమ్యాన్ని చేరుకున్నారు. 59 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటల 10 నిమిషాల్లోనే పూర్తిచేసి రికార్డు సాధించారు.