MCA | ముంబై: ప్రపంచ క్రికెట్లో అత్యంత సంపన్న బోర్డు బీసీసీఐ కాగా రాష్ర్టాల క్రికెట్ అసోసియేషన్ల పరంగా చూస్తే ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)ది ప్రత్యేక స్థానం. దేశవాళీలో ముంబై జట్టుకు, అక్కడి ఆటగాళ్లకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
సంపాదనపరంగా ఎంసీఏకు ఆదాయం తక్కువేమీ కాదు. ఇటీవలే ఎంసీఏ ప్రఖ్యాత వాంఖడే క్రికెట్ మైదానం స్వర్ణోత్సవ వేడుక సందర్భంగా.. స్టేడియం నిర్వహణను చూసుకునే గ్రౌండ్ సిబ్బందికి ‘సత్కారం’ పేరుతోఎంసీఏ ఇచ్చిన బహుమతులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘జంబో గిఫ్ట్ హ్యాంపర్’ పేరిట 178 మంది వాంఖడే సిబ్బందికి ఎంసీఏ పంపిణీ చేసిన ఆ కిట్లో.. ఐదు కిలోల బియ్యం, ఐదు కిలోల పప్పు, ఒక టీ షర్ట్, తువ్వాలు, పెన్నులు, సబ్బులు, కొబ్బరి నూనె, దువ్వెన, టూత్ బ్రష్, పేస్ట్, గొడుగు, బెడ్షీట్ వంటి కిరాణా కొట్టు సామాన్లున్నాయి. ఇది చూసిన సిబ్బంది అవాక్కై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.