Cardiac Arrest: గుండెపోటుతో మైదానంలోనే క్రికెటర్ మృతి.. వీడియో
Cardiac Arrest: పుణెలో ఓ క్రికెటర్ గుండెపోటుతో మైదానంలో కూలిపోయాడు. ఈ ఘటన వీడియోకు చిక్కింది. బ్యాటింగ్ చేస్తున్న అతనికి ఛాతిలో తీవ్ర నొప్పి వచ్చింది. దీంతో అతను అక్కడే కుప్పకూలాడు.
పుణె: ఓ క్రికెటర్ గుండెపోటు(Cardiac Arrest) రావడంతో.. మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన పుణెలో జరిగింది. నగరంలోని గర్వారి స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో.. ఈ ఘటన చోటుచేసుకున్నది. 35 ఏళ్ల బ్యాటర్ ఇమ్రాన్ పటేల్ అకస్మాత్తుగా గుండె నొప్పితో కుప్పకూలాడు. ఓపెనర్‌గా వెళ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఇమ్రాన్ పటేల్ తన ఛాతిలో నొప్పి వస్తున్నట్లు పేర్కొన్నాడు. అంపైర్లకు ఆ విషయాన్ని చెప్పాడు. ప్లేయర్లు కొంత సేపు ఆట నిలిపివేశారు. ఆ తర్వాత మైదానం బయటకు వెళ్తున్న సమయంలో అతను కుప్పకూలాడు. హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఇమ్రాన్ పటేల్ మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమ్ చేస్తున్న నేపథ్యంలో.. ఆ ఘటన కెమెరాలకు చిక్కింది. బ్యాటర్ ఇమ్రాన్ పటేల్ కిందపడిపోగానే, ప్లేయర్లు అందరూ అతని వైపు పరుగులు తీశారు.
A young man, Imran Sikandar Patel, died of a #heartattack while playing cricket in the Chhatrapati Sambhaji Nagar district of Maharashtra.https://t.co/aCciWMuz8Y pic.twitter.com/pwybSRKSsa
— Dee (@DeeEternalOpt) November 28, 2024
గుండెపోటుతో మృతిచెందిన ఇమ్రాన్‌కు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని తోటి జట్టు సభ్యులు వెల్లడించారు. ఆల్‌రౌండర్ అయిన అతను చాలా ఫిట్‌గా ఉంటాడని తెలిపారు. ఏ కారణం చేత అతనికి కార్డియాక్ అరెస్టు అయినట్లు స్పష్టంగా తెలియదు. ఇమ్రాన్ పటేల్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇమ్రాన్‌కు తన ఏరియాలో మంచి గుర్తింపు ఉన్నది. అతనికి ఓ క్రికెట్ జట్టు ఉన్నది. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో కూడా ఉన్నాడతను. ఓ జ్యూష్ షాపును కూడా నడిపిస్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో ఘనంగా మత్స్య కార్మికుల దినోత్సవం
Ganapati Puja At Police Station | పోలీస్ స్టేషన్లో హోమం.. రేకెత్తించిన రాజకీయ వివాదం
AP Student | గుజరాత్‌లోని వడోదరలో ఏపీ విద్యార్థి మృతి
El Chapo Isidro | ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలోని డ్రగ్ డాన్ ఎల్ చాపో ఇసిద్రో అరెస్ట్..!
వైద్య సిబ్బందిపై డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

