నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ దీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్.. 83 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది. కావెమ్ హాడ్జ్ (120) సెంచరీతో కదంతొక్కగా అలిక్ అథనేజ్ (82), బ్రాత్‌వైట్ (48) రాణించారు. డ సిల్వ (28నాటౌట్), హోల్డర్(22 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ మార్క్‌వుడ్ 150కి.మీ వేగంతో నిలకడగా బౌలింగ్ చేయడం మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది.