జైపూర్: కెప్టెన్ రాహుల్ సింగ్ (66), వికెట్ కీపర్ రాహుల్ రాధేశ్ (43 బ్యాటింగ్) ఆదుకోవడంతో రాజస్థాన్‌తో జైపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ తొలిరోజు 5 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (40) రాణించాడు. రాధేశ్తో పాటు అజయ్‌దేవ్ గౌడ్ (34 నాటౌట్) క్రీజులో ఉన్నారు.