జనగామ చౌరస్తా, జనవరి 12: దక్షిణాది రాష్ర్టాల 20వ సీనియర్ సాఫ్ట్బాల్ టోర్నీ శుక్రవారం జనగామలో మొదలయ్యాయి. రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారి పోటీలు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన మహిళల మ్యాచ్లో తెలంగాణ 10-0తో తమిళనాడుపై ఘన విజయం సాధించింది. మిగతా మ్యాచ్ల్లో కేరళ 10-0తో పాండిచ్చేరిపై, కేరళ 10-0తో కర్ణాటకపై, ఏపీ 10-0తో తమిళనాడుపై, పాండిచ్చేరి 4-3తో కేరళపై, కేరళ 4-0తో కర్ణాటకపై గెలిచి ముందంజ వేశాయి. అంతకు పోటీలను గోవా మాజీ స్పీకర్ చోడంకర్, జాతీయ సాఫ్ట్బాల్ ఫెడరేషన్ కార్యదర్శి మౌర్య, సీఈవో ప్రవీణ్ అనూకర్ హాజరయ్యారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి 224 మంది ప్లేయర్లతో పాటు 28 కోచ్లు పాల్గొంటున్నట్లు జిల్లా సెక్రెటరీ భగత్ పేర్కొన్నారు.