కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలు, ఆకాంక్షలతో వచ్చేసింది. నిరుడు టీ20 ప్రపంచకప్ విజయం భారత క్రికెట్లో నయా జోష్ నింపగా, ఈసారి మరికొన్ని మెగాటోర్నీలు అలరించబోతున్నాయి. మహిళల అండర్-19 ప్రపంచకప్‌తో మొదలై చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్స్, మహిళల వన్డే ప్రపంచకప్‌తో పతాకస్థాయికి చేరుకోనుంది. తొలిసారి భారత్ వేదికగా ఖోఖో ప్రపంచకప్‌నకు తెరలేవనుండగా, సాకర్ క్లబ్ వరల్డ్‌కప్, డైమండ్ లీగ్, ప్రపంచ టీటీ టోర్నీ రంజింపచేయనున్నాయి.
వీటికి తోడు ఐపీఎల్, ఐఎస్ఎల్, పీకేఎల్, బిగ్‌బాష్‌లీగ్, హండ్రెడ్ టోర్నీలు ఫ్యాన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు, బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లు, ఫార్ములావన్ పోటీలు, కుస్తీ పోరాటాలు.. ఇలా ఆట ఏదైనా మజా మాత్రం పక్కా. మరి ఇంకెందుకు ఆలస్యం షెడ్యూల్‌పై మనం ఒక లుక్కెద్దాం పదండి.
ఫిబ్రవరి 19 – మార్చి 9
పాకిస్థాన్, యూఏఈ
క్రికెట్ ప్రపంచకప్ జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేషియా
2023-25 ఫైనల్ జూన్ 11 – 15 లార్డ్స్, లండన్
ఆగస్టు – సెప్టెంబర్ (పూర్తి స్థాయి షెడ్యూల్ రావాల్సి ఉంది)భారత్
ఆస్ట్రేలియా ఓపెన్ జనవరి 6 – 26
వింబుల్డన్ జూన్ 30 – జులై 13
ఫ్రెంచ్ ఓపెన్ మే 19 – జూన్ 8
యూఎస్ ఓపెన్ ఆగస్టు 25 – సెప్టెంబర్ 07
జనవరి 03-07 వరకు ఆసీస్‌తో చివరి టెస్టు (సిడ్నీ)
జనవరి 22 – ఫిబ్రవరి 02 ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్
ఫిబ్రవరి 06 – 12 ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్
జూన్-ఆగస్టులో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్
ఆగస్టులో బంగ్లాదేశ్‌తో 3 వన్డేలు, 3 టీ20లు
అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో 2 టెస్టులు (స్వదేశంలో)
అక్టోబర్‌లో ఆసియా కప్ (టీ20 ఫార్మాట్) (స్వదేశంలో)
అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటన 5 టెస్టులు, 3 వన్డేలు
ఐపీఎల్ : మార్చి 14 నుంచి మే 25 వరకు
జనవరి 07-12 : మలేషియా ఓపెన్
జనవరి 14-19 : ఇండియా ఓపెన్
మార్చి 11-16 : ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్
మే 27- జూన్ 01 : సింగపూర్ ఓపెన్
జూన్ 03-08 : ఇండోనేషియా ఓపెన్
జూలై 15-20 : జపాన్ ఓపెన్
జూలై 22-27 : చైనా ఓపెన్
సెప్టెంబర్ 16-21 : చైనా మాస్టర్స్
అక్టోబర్ 14-19 : డెన్మార్క్ ఓపెన్
అక్టోబర్ 21-26 : ఫ్రెంచ్ ఓపెన్
మార్చి 14-16 : ఆస్ట్రేలియా జీపీ
ఏప్రిల్ 4-16 : జపాన్ జీపీ
ఏప్రిల్ 11-13 : బహ్రెయిన్ జీపీ
ఏప్రిల్ 18-20 : సౌదీ అరేబియా జీపీ
మే 2-4 : మియామి జీపీ
జూన్ 27-29 : బెల్జియం జీపీ
ఆగస్టు 1-3 : హంగేరి జీపీ
సెప్టెంబర్ 5-7 : ఇటాలియన్ జీపీ
నవంబర్ 20-22 : లాస్ వెగాస్ జీపీ
డిసెంబర్ 5-7 : అబుదాబి జీపీ
జవనరి 13-19 ఖో ఖో ప్రపంచకప్ (భారత్)
ఫిబ్రవరి 07-14 ఏషియన్ వింటర్ గేమ్స్
మే 17-25 : వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్
ఆగస్టు 27-28 : డైమండ్ లీగ్ ఫైనల్స్ (అథ్లెటిక్స్)