Ons Jabeur : రాబోయే కొత్త ఏడాది తనకు చాలా ప్రత్యేకం అని, కచ్చితంగా గ్రాండ్ స్లామ్ గెలుస్తానని ట్యునీషియాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి ఓన్స్ జబేర్ ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది గ్రాండ్ స్లామ్ గెలవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాను. 2023లో నా ఆటను మరింత మెరుగ్గా ఆడతాను అని ప్రపంచంలో రెండో ర్యాంకర్ అయిన ఓన్స్ చెప్పింది. ఈ ఏడాది రెండు సార్లు గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన ఓన్స్ జబేర్ రన్నరప్‌గా నిలిచింది. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్లో టైటిల్ సాధించాలనే ఆమె కల నెరవేరలేదు.
వింబుల్డన్ ఫైనల్లో ఓన్స్ 3–6, 6–2, 6–2తో కజకిస్థాన్‌కు చెందిన ఎలెనా రిబాకినా చేతిలో పరాజయం పాలైంది. యూఎస్ ఓపెన్ ఫైనల్లో వరల్డ్ నంబర్ 1 ఇగా స్వియాటెక్ 6–2, 7–6తో ఓన్స్ను ఓడించింది. దాంతో, వచ్చే ఏడాదిలో తన కలను నిజం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. రెండు ఫైనల్స్ ఆడిన అనుభవం తాను గ్రాండ్‌స్లామ్ గెలిచేందుకు పనికొస్తుందని ఓన్స్ ఆత్మవిశ్వాసంతో ఉంది.