ENG vs SL: కర్మఫలం అనుభవించక తప్పదు..! ఇంగ్లండును ఆటాడుకుంటున్న నెటిజన్లు
ENG vs SL: వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఇంగ్లండ్ కూడా ఇప్పుడు కర్మ ఫలాన్ని అనుభవిస్తుందని వాపోతున్నారు క్రికెట్ అభిమానులు.
ENG vs SL: మనిషి చేసే ప్రతి చర్యకు ప్రతిఫలం అనుభవించి తీరాలి.. మంచి కర్మకలకు పుణ్యం, చెడు కర్మలకు చెడు ప్రతిఫలం అనుభవించాలన్నది కర్మ సిద్ధాంతం. వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఇంగ్లండ్ కూడా ఇప్పుడు కర్మ ఫలాన్ని అనుభవిస్తుందని వాపోతున్నారు క్రికెట్ అభిమానులు. ఈ మెగా టోర్నీలో ఇదివరకే నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడింట్లో ఓడిన ఇంగ్లండ్.. తాజాగా పసికూన వంటి శ్రీలంకతో ఆడుతు కూడా బ్యాటింగ్‌లో చతికిలపడటాన్ని చూసి ఇంగ్లండ్ ప్రస్తుతం 2019 కర్మ ఫలాన్ని అనుభవిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీలంకతో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బట్లర్ సేన.. 33.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలిన తర్వాత ఎక్స్ (ట్విటర్) వేదికగా నెటిజన్లు ఇంగ్లండ్‌ను ఆటాడుకుంటున్నారు. 2019లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్.. నిర్ణీత 50 ఓవర్ల ఆటతో పాటు సూపర్ ఓవర్లో స్కోర్లు సమమైనా బౌండరీల పరంగా కివీస్ కంటే ఎక్కువ ఉన్నాయనే కారణంగా ఇంగ్లీష్ జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్ తొండి చేసి వరల్డ్ కప్ గెలిచిందన్న వాదనలు వినిపించాయి.
I think it’s fair that luck hasn’t favored England this time, especially after their controversial and unfair win in the last World Cup. Karma?#ENGvSL #CWC2023
— Asadullah Mirani (@AsadullahMirani) October 26, 2023
ఇక తాజాగా భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శనకు కారణం నాటి కర్మనేనని ట్విటర్ వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. 2019లో ఇంగ్లండ్ చీటింగ్ చేసి గెలిచిందని వాపోతూ బట్లర్ సేనను ఆటాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
This is called karma. England won by cheating in 2019. #ENGvsSL
— Pappu Nalaiq (@PappuNalaiq) October 26, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

