చెన్నై: తమిళనాడు ప్రీమియర్ లీగ్(TNPL 2023)లో అరుదైన రికార్డు నమోదు అయ్యింది. చెపాక్ సూపర్ గిల్లీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సేలమ్ స్పార్టన్స్ బౌలర్ ఒకే బంతికి 18 రన్స్ ఇచ్చుకున్నాడు. స్పార్టన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లోని చివరి బంతికి 18 రన్స్ సమర్పించుకోవడం గమనార్హం. వాస్తవానికి లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అతనే. కానీ ఈ మ్యాచ్‌లో తన్వర్ ఒక్క బాల్కే 18 రన్స్ ఇచ్చేశాడు. అసలు అన్ని రన్స్ ఎలా వచ్చాయో తెలుసుకుందాం.
19వ ఓవర్లో ఆరో బంతిని నో బాల్‌గా వేశాడు. నిజానికి ఆ బంతికి బ్యాటర్ బౌల్డ్ అయ్యాడు. కానీ నోబాల్ కావడంతో ఒక్క రన్ వచ్చింది.
ఇక తర్వాత బాల్ కూడా నోబాల్లే పడింది. బ్యాటర్ ఆ బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో మొత్తం 8 రన్స్ అయ్యాయి.
ఆ తర్వాత మూడో నోబాల్ వేశాడు. బ్యాటర్ రెండు రన్స్ తీశాడు. దీంతో టోటల్ 11కు చేరింది.
బౌలర్ ఈసారి వైడ్ బాల్ వేశాడు. దీంతో పరుగుల సంఖ్య 12కు చేరింది.
చివరకు సరైన బంతినే వేశాడు. కానీ బ్యాటర్ ఆ బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఒక్క బంతికే 18 రన్స్ వచ్చినట్లు అయ్యింది.
The most expensive delivery ever? 1 Ball 18 runs#TNPLonFanCode pic.twitter.com/U95WNslHav
— FanCode (@FanCode) June 13, 2023