Seem Punia : భారత స్టార్ డిస్కస్ త్రోయర్ సీమా పూనియా (Seem Punia) చిక్కుల్లో పడింది. ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో దేశం గర్వపడేలా చేసిన పూనియా ఇటీవల డోప్ టెస్టు(Dope Test)లో విఫలమైంది. ఫలితంగా డోపింగ్ నిరోధక క్రమశిక్షణ కమిటీ ఆమెపై 16 నెలల నిషేధం విధించింది. ఈ ఏడాది నవంబర్ 10 నుంచి ఈ డిస్కస్ త్రోయర్‌పై నిషేధం అమలులోకి రానుంది. అయితే.. పూనియా ఉపయోగించిన నిషేధిత డ్రగ్ వివరాలను మాత్రం నాడా (NADA) వెల్లడించలేదు.
పూనియా చివరిసారిగా 2023 అక్టోబర్‌లో చైనాలోని హంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో పోటీ పడి కాంస్యం గెలుచుకుంది. ఆ తర్వాత ఏ టోర్నీలోనూ పూనియా పాల్గొనలేదు. పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) తర్వాత వీడ్కోలు పలకాలనుకున్న తను ఆ టోర్నీకి అర్హత సాధించలేదు. తన సుదీర్ఘ కెరీర్లో పూనియా నాలుగు విశ్ర క్రీడ(2004, 2012, 2016, 2020)ల్లో పోటీ పడింది. కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగుసార్లు విజేతగా నిలిచిన పూనియా.. అంతర్జాతీయ డిస్కస్ త్రో పోటీల్లోనూ మూడు వెండి పతకాలు కొల్లగొట్టింది.
Discus Thrower and Asian Games and Commonwealth Games medallist Seema Punia suspended for 16 months for a doping violation by NADA. Ban effective from 10th November 2025: National Anti-Doping Agency (NADA)
(File photo) pic.twitter.com/XXVxxvoQe9
— ANI (@ANI) December 6, 2025
హర్యానాకు చెందిన పూనియా భారత డిస్కస్ త్రోలో సంచలనం. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో తొలిసారి స్వర్ణం గెలుపొందింది. అనంతరం 2018 ఎడిషన్‌లో ఈ స్టార్ అథ్లెట్ కాంస్యంతో మెరిసింది. డిస్కస్ త్రోలో పూనియా అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన 64.84 మీటర్లను 2004లో నమోదు చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు బ్రేక్ చేసిన పూనియా.. పారా జావెలిన్ త్రోయర్ సందీప్ చౌదరీ (Sandeep Chaudhary)కి కోచ్‌గా వ్యవహరించింది. ఆమె శిక్షణలో రాటుదేలిన సందీప్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించాడు.