హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఆర్మీ సదరన్ కమాండ్ ఇంటర్ వాలీవాల్ చాంపియన్షిప్లో12 కార్ప్స్ ట్రూప్స్ జట్టు విజేతగా నిలిచింది. శనివారం సికింద్రాబాద్ జరిగిన ఫైనల్లో 12 కార్ప్స్ ట్రూప్స్ 25-19, 25-18, 25-20 తేడాతో 12 ర్యాపిడ్ జట్టుపై విజయం సాధించింది.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈఎంఈ సెంటర్ కమాండెంట్ బ్రిగేడియర్ ప్రశాంత్ బాజ్పాయ్ విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలతో పాటు పతకాలను అందజేశారు.