అబుదాబి: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకున్న పాక్.. సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. సూపర్-12లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో పాక్ 45 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఓపెనర్లు రిజ్వాన్ (79 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (70; 7 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. క్రెయిగ్ విలియమ్స్ (40), వైస్ (43 నాటౌట్) రాణించారు. రిజ్వాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.